రంగారెడ్డి జిల్లా పహడీ షరీఫ్ పీఎస్ పరిధిలోని జల్పల్లి పెద్ద చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని నీటిలోంచి బయటకు తీశారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.
అనుమానాస్పద మృతి క్రింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహంపై ఎలాంటి దుస్తులు లేకపోవడం వల్ల ఈతకు వచ్చి మృతి చెంది ఉంటాడు పోలీసుల అనుమానిస్తున్నారు.
ఇదీ చూడండి: 'వికృత చేష్టలకు పాల్పడితే కఠిన చర్యలు'