ETV Bharat / jagte-raho

యాసిడ్‌ తాగిన మహిళ.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు - బడంగ్‌పేట్‌లో యాసిడ్‌ తాగిన గుర్తు తెలియని మహిళ

ఆపదలో ఉన్న ఓ మహిళను మీర్‌పేట్‌ పోలీసులు ఆదుకున్నారు. పీఎస్‌ పరిధిలోని బడంగ్‌పేట్‌లో గుర్తుతెలియని మహిళ యాసిడ్‌ తాగిందన్న సమాచారంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పూర్తి వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

unknown women drunk acid police join her in hospital
యాసిడ్‌ తాగిన మహిళను ఆస్పత్రికి తరలిస్తున్న పోలీసులు
author img

By

Published : Jan 14, 2021, 9:12 PM IST

గుర్తు తెలియని మహిళ యాసిడ్‌ తాగిందన్న సమాచారంతో హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌ పోలీసులు స్పందించారు. సంఘటనా స్థలానికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపగా.. మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

బడంగ్‌పేట్‌లోని రోమా ఎన్‌క్లేవ్‌లో 55 ఏళ్ల మహిళ యాసిడ్‌ తాగిందని స్థానికులు 100కు డయల్‌చేసి సమాచారమిచ్చారు. అయితే భర్త వేధింపులు తాళలేక యాసిడ్‌ తాగినట్లు బాధితురాలు ఇచ్చిన సమాచారంతో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మహిళకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి : మృత్యుంజయుడు... బాలుడికి త్రుటిలో తప్పిన ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.