మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో ఓ ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ విషయంలో బాధితుడు పోలీసులకు ఫిర్యాదుచేశాడు.
జీడీమెట్ల పరిధి సంజయ్ గాంధీ నగర్‌కు చెందిన ఉమేశ్.. శనివారం రాత్రి.. భోజనం చేసి నిద్రపోయాడు. అర్ధరాత్రి వేళ.. బైక్ నుంచి మంటలు రావడాన్ని గమనించిన ఉమేశ్ సోదరి.. గట్టిగా అరిచింది. అప్రమత్తమైన బాధితుడు మంటలను అదుపుచేశాడు. అనంతరం తన సోదరి ఇంటి తలుపుపైనా పెట్రోల్ పోసినట్లు గుర్తించాడు బాధితుడు.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాదు. ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఘటన జరిగిన ప్రాంతంలో రెండు లీటర్ల పెట్రోల్ డబ్బా దొరికినట్లు తెలిపారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీచూడండి: ఆ అనుమానంతోనే తల్లిని కడతేర్చాడా..?