ETV Bharat / jagte-raho

ఇంటి చుట్టూ విద్యుత్​ తీగలు అమర్చి.. హత్యకు యత్నం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతన పంథాలో హత్యకి యత్నించారు కొందరు దుండగులు. విద్యుత్​ తీగలతో తెరాస నాయకుడిని చంపేందుకు స్కెచ్​ వేశారు. శత్రువు ఇంటి చుట్టూ కరెంటు తీగలను వ్యాపింపజేశారు. కానీ తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

author img

By

Published : Nov 30, 2020, 6:11 PM IST

unknown persons attempted to kill a trs leader family in bhadradri
ఇంటి చుట్టూ విద్యుత్​ తీగలు అమర్చి.. హత్యకు యత్నం

భద్రాచలంలోని తెరాస నాయకునిపై గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్ తీగలతో హత్య చేసేందుకు యత్నించారు. కొత్తపేట కాలనీకి చెందిన తెరాస నాయకుడు నర్రా రాముని హత్య చేసేందుకు దుండగులు యత్నించారు. ఆదివారం రాత్రి అతని ఇంటి చుట్టూ తీగలు అమర్చారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం నర్రా రాము తన ఇంటి ముందు కరెంటు తీగలు ఉండటాన్ని గుర్తించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ తీగలను కరెంటు స్తంభం నుంచి ఇంటి వరకు దుండగులు తీసుకువచ్చి వాటర్ ట్యాంకుకి సప్లై ఇచ్చారు. అలాగే ఇంటి గుమ్మానికి, గదులలోని బైండింగ్ వైర్​కి అనుసంధానం చేశారు. కానీ ఇంటి లోపలికి సప్లై ఇచ్చిన వైరు కాలిపోయింది. దీంతో ప్రమాదం తప్పిందని కుటుంబ సభ్యులు అన్నారు.

ఫిర్యాదు అందుకున్న భద్రాచలం సీఐ స్వామి క్లూస్ టీమ్​, డాగ్ స్క్వాడ్​ను పిలిపించి దర్యాప్తు చేపట్టారు. వ్యక్తిగత కారణాలా లేక ఆర్థిక లావాదేవీల కారణంగా ఎవరైనా హత్యకు యత్నించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని సీఐ తెలిపారు.

ఇదీ చదవండి: యజమాని ఏటీఎంతో 12 లక్షలు డ్రా...నిందితులు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.