ETV Bharat / jagte-raho

రోడ్డు పక్కన పసికందు: ఆడ పిల్లనా.. అనారోగ్యమనా? - తెలంగాణ నేర వార్తలు

ఆడపిల్ల అని వదిలించుకున్నారో.. అనారోగ్యంతో పుట్టిందని వద్దనుకున్నారో తెలియదు కాని వారం రోజుల కిందట పుట్టిన బిడ్డను రోడ్డు పక్కన వదిలేశారు. చిన్నారిని చూసిన స్థానికులు మాతాశిశు కేంద్రానిక తరలించారు. ఈ ఘటన ఖమ్మం పట్టణంలో జరిగింది.

రోడ్డు పక్కన పసికందు: ఆడ పిల్లనా.. అనారోగ్యమనా?

author img

By

Published : Oct 4, 2020, 10:51 AM IST

ఖమ్మంలో దారుణం జరిగింది. వారం రోజుల క్రితం పుట్టిన ఓ పసిపాపను గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డు పక్కన పడేశారు. ఖమ్మం మయూరి వంతెన దిగువ జూబ్లీక్లబ్ వద్ద రోడ్డు పక్కన శనివారం సాయంత్రం ఆటోలో వచ్చిన కొందరు పసికందును వదిలేసి వెళ్లిపోయారు. పాప ఏడుపు విన్న స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు చిన్నారిని మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

ఆ పాపను శనివారం సాయంత్రమే మాతాశిశు కేంద్రం నుంచి కొందరు తీసుకెళ్లారని సిబ్బంది తెలిపారు. చిన్నారికి శ్వాస సంబంధిత సమస్య ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. పసికందును రోడ్డుపై పడేయడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: దారుణం: మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.