ETV Bharat / jagte-raho

ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్న దొంగల అరెస్టు - హైదరాబాద్​ లో బైకు దొంగల అరెస్టు

నగరంలో ద్విచక్రవాహనల దొంగతనానికి పాల్పడుతోన్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఎనిమిది ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గతంలోనూ పలు పోలీసు స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు.

two-wheeler-thieves-arrested-by-nampally-police
ద్విచక్రవాహనల చోరీకి పాల్పడుతున్న దొంగల అరెస్టు
author img

By

Published : Dec 17, 2020, 10:53 AM IST

హైదరాబాద్​లో ద్విచక్రవాహనల దొంగతనానికి పాల్పడుతోన్న ముగ్గురు వ్యక్తులను నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఖైరతాబాద్ చింతల బస్తీ లో నివాసం ఉండే ఆర్షద్ ఈ నెల 5న నాంపల్లి లోని ఓ ఆసుపత్రికి వచ్చాడు. తన ద్విచక్ర వాహనాన్ని అక్కడే నిలిపి లోనికి వెళ్లి వచ్చేసరికి వాహనం చోరి అయింది. వెంటనే బాధితుడు నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు.

చోరి జరిగిన ప్రదేశంలోని సీసీటీవీలో నమోదైన దృష్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు సత్యరామ్, కృష్ణ , సంజు కుమార్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిపై గతంలో పలు పోలీస్ స్టేషన్ పరిధిలలో దొంగతనాలకు పాల్పడినట్లు అధికారులు నిర్దారించారు. వారి వద్ద నుంచి ఎనిమిది ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సైఫాబాద్ ఏసీపీ తెలిపారు. దొంగిలించిన వాహనాలు విక్రయించేందుకు ఆంజనేయులు అనే వ్యక్తి వారికి సహకరిస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

ఇది చూడండి :పెళ్లింట్లో విషాదం.. ట్రాక్టర్​ బోల్తాపడి ముగ్గురు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.