సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ లైన్ మరమ్మతులు చేస్తుండగా షాక్తో ఇద్దరు యువకులు మృతి చెందారు. ట్రాన్స్‌ఫార్మర్ బంద్ చేసి.. కొట్టె గోపి(23),పాలేటి రాము(32) పొలంలో సర్వీస్ వైర్ లాగుతుండగా.. అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా అవడం వల్ల అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
వారి మృతికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతుల బంధువులు ఆందోళన చేపట్టారు. ఇద్దరు యువకుల మరణంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
ఇదీ చదవండి: 'కుటుంబ పాలన పోవాలి... భాజపా ప్రభుత్వం రావాలి'