సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని నాగారం బంగ్లా గ్రామం వెలుపల ఉన్న రైస్ మిల్లుల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. రైస్ మిల్లులో వలస కూలీగా పనిచేస్తున్న బీహార్‌కు చెందిన సుబోద్ కుమార్... కాలినడకన మరో వ్యక్తితో కలిసి నాగారం బంగ్లా ఎక్స్‌రోడ్‌కు వెళ్తున్నాడు.
ఇదే సమయంలో శాలిగౌరారం మండలం గురజాల గ్రామానికి చెందిన పరుశరాములు అతని భార్యతో కలసి తిరుమలగిరి నుంచి అర్వపల్లి వైపు ద్విచెక్రవాహనంపై వెళుతున్నాడు. సుబోద్ కుమార్‌ని వెనక నుంటి ఢీ కొట్టటం వల్ల సుబోద్ కుమార్ తలకు, ముఖానికి గాయాలు కాగా.... పరశురాములుకు కుడి చేయి విరిగిందని తెలిపారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.