భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పరిధి సుభాష్ నగర్లోని ఓ ఆర్ఎంపీ క్లినిక్పై డ్రగ్ ఇన్స్పెక్టర్ దాడి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. లక్ష ఉంటుందని ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తెలిపారు.
గ్రామీణ వైద్యులుగా పనిచేస్తూ.. మందులు కూడా విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో దాడులు నిర్వహించినట్లు ఆయన వివరించారు. ఇద్దరు ఆర్ఎంపీ వైద్యులను అరెస్టు చేసి.. వారిపై 18 సీ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ చట్టం 19, 40 ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. ఈ దాడుల్లో ఖమ్మం రూరల్ ఎస్సై సోమేశ్వర్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: డేటింగ్ యాప్లతో మోసం చేస్తున్న ముఠా అరెస్టు