మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బెస్త గుండెబోయిన ముత్యాలు, అతని బావ వినయ్ అనే ఇద్దరు పెద్ద చెరువులో నిన్న సాయంత్రం సమయంలో చేపల వేటకు వెళ్లి చెరువులో గల్లంతయ్యారు.
చేపల వేటకు వెళ్లి ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యుల సమాచారంతో రాత్రి నుంచి నీటమునిగిన వారికోసం గాలింపు చేపట్టారు. ఇవాళ ఉదయం గ్రామానికి చెందిన గజ ఈతగాళ్లతో చెరువులో గాలించి ఇద్దరి మృతదేహాలు వెలికితీశారు. చేగుంట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: కొత్త విద్యా విధానం... కొన్ని సవాళ్లు!