ETV Bharat / jagte-raho

ప్రైవేటు వైద్యుల నిర్లక్ష్యం.. చూపు పోయిందని బాధితుల ఫిర్యాదు!

ఓ ప్రైవేటు కంటి ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల తమ కంటి చూపు పోయిందని ఇద్దరు బాధితులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులను మెరుగైన వైద్యం కోసం సరోజిని దేవి కంటి ఆస్పత్రికి తరలించారు.

ప్రైవేటు కంటి ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం.. చూపు పోయిందని బాధితుల ఫిర్యాదు

author img

By

Published : Oct 11, 2020, 11:21 PM IST

వైద్యుల నిర్లక్ష్యంతో తమ కంటిచూపు పోయిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈఘటన హైదరాబాద్​ పంజాగుట్టలో జరిగింది. దోమలగూడకు చెందిన కళావతి కంటి సంబంధిత రుగ్మతతో హిమాయత్​నగర్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. పలు వైద్య పరీక్షలు చేసి గత నెల 30న కంటికి శస్త్ర చికిత్స చేశారు. ఆమెతో పాటు గాంధీనగర్​కు చెందిన పద్మకు ఆపరేషన్​ చేశారు. ఈ రెండు శస్త్రచికిత్సలు విఫలం కావడం వల్ల బాధితులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. గుర్తించిన వైద్యులు వారికి మరలా పంజాగుట్టలోని తమ బ్రాంచి ఆస్పత్రిలో చికిత్స అందించారు.

అయినప్పటికీ కంటిచూపు మెరుగుకాకపోవడం వల్ల బాధిత కుటుంబసభ్యులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితులను మెరుగైన వైద్యం కోసం మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రికి పంపించారు.

ఇదీ చూడండి: దంపతుల మధ్య కరోనా గొడవ... తెల్లారే భార్య ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.