యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణ శివారులోని మల్లేపల్లి గ్రామ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందారు. ప్రమాదంలో మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుడు వలిగొండకు చెందిన రాహుల్ అనే బాలుడిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ యువకుడు వెల్వర్తి గ్రామానికి చెందిన దశరథగా గుర్తించారు. అతడిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదంలో మృతిచెందిన బాలుడి తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల నుంచి కూలీ పనుల కోసం వలిగొండకు వలస వచ్చినట్లు తెలుస్తోంది. గత సంవత్సర కాలంగా వారు ఇక్కడే నివసిస్తున్నారు. వలిగొండ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
ఇవీ చూడండి: నెలుట్ల వద్ద ఆటో బోల్తా- మహిళ మృతి