అనంతపురం జిల్లా పామిడి మండలం దిబ్బసానిపల్లి గ్రామ సమీపంలోని కొండల్లో రెండు చిరుతలు సంచరిస్తూ గ్రామాల ప్రజలకు భయాందోళన కలిగిస్తున్నాయి. గురువారం.. మేకల గుంపును చూసిన చిరుత పులులు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో మూడు మేకలు చనిపోగా మరికొన్ని గాయపడ్డాయి. ఇది గమనించిన కాపరి మనోజ్ గట్టిగా కేకలు వేశాడు. దీంతో చిరుతపులి అతనిపై దాడి చేయడానికి ప్రయత్నించగా తప్పించుకుని పరారయ్యాడు.
శుక్రవారం కూడా చిరుతపులి సంచరించటం చూసిన స్థానికులు ఆ దృశ్యాలను తమ చరవాణిలో బంధించారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టి చిరుతపులి నుంచి రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీచూడండి: చెరువులో పడి నలుగురు చిన్నారులు మృతి