మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం ఎక్స్ రోడ్డు వద్ద శనివారం అర్ధరాత్రి రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో శేఖర్, గణేశ్ అనే ఇద్దరు స్నేహితులు దుర్మరణం చెందారు.
భీమారం గ్రామానికి చెందిన శేఖర్, గణేశ్‌లు ప్రాణ స్నేహితులు. డ్రైవర్‌గా పనిచేస్తోన్న గణేశ్‌కు శనివారం మంచిర్యాలలోని ఆసుపత్రిలో కూతురు పుట్టింది. ఫలితంగా శేఖర్, గణేశ్‌లు ద్విచక్ర వాహనంపై కూతురును చూసేందుకు వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఇందారం ఎక్స్ రోడ్డు వద్ద బైక్ అదుపు తప్పి కిందపడ్డారు.
ప్రమాదంలో గణేశ్ అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలైన శేఖర్‌ను ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. ఇద్దరి మృతితో బాధిత కుటుంబాల్లో రోదనలు మిన్నంటగా.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీచూడండి.. ఐదు రోజులుగా ఆసిఫాబాద్‌లోనే పోలీస్ బాస్.. అధికారులతో సమీక్ష