వరంగల్ జిల్లా హన్మకొండ పల్లెల్పులకు చెందిన చింతల రమేశ్ బాబు, పాలకుర్తి మండలం బమ్మెర గ్రామానికి చెందిన డ్రైవర్ బానోత్ రమేశ్‌తో కలిసి హైదరాబాద్ నుంచి హన్మకొండకు వెళ్తున్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కొమ్మాలలోతు వాగు వంతెనపై ఒక్కసారిగా కారు అదుపుతప్పింది. డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది.
ఈ ఘటనలో రమేశ్ బాబు అక్కడికక్కడే మృతి చెందగా.. డ్రైవర్ బానోత్ రమేశ్ జనగామ ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.