ETV Bharat / jagte-raho

కల్వర్టును ఢీకొని గుంతలో పడ్డారు.. అనంతలోకాలకు చేరారు..! - siddipet district latest news

బరాత్​ వేడుకకు బ్యాండ్​ వాయించేందుకు వెళ్లారు. కార్యక్రమం ముగిశాక.. ద్విచక్ర వాహనంపై తెల్లవారుజామున తిరిగి ఇంటికి బయలుదేరారు. చివరికి ఇంటికి చేరకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది.

two died in a road accident near by peerlapalli in siddipet district
కల్వర్టును ఢీకొని గుంతలో పడ్డారు.. అనంతలోకాలకు చేరారు..!
author img

By

Published : Jan 4, 2021, 7:53 PM IST

సిద్దిపేట జిల్లా జగదేవ్​పూర్​ మండలం పీర్లపల్లి సమీపంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం కల్వర్టును ఢీకొని, నీటి గుంతలో పడిపోయింది. ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మౌలాలీకి చెందిన అనిల్ గౌడ్, ఉపేందర్​లతో పాటు మరో 15 మంది యువకులు 2 ఆటోలు, ఒక ద్విచక్ర వాహనంపై సిద్దిపేట జిల్లా జగదేవ్​పూర్​ మండల కేంద్రంలో ఆదివారం జరిగిన ఓ బరాత్​కు బ్యాండ్​ వాయించేందుకు వచ్చారు. కార్యక్రమం ముగియగానే అదే రోజు అర్ధరాత్రి ఒక ఆటోలో కొంతమంది తిరిగి వెళ్లిపోయారు. మరో ఆటోలో మరికొంతమంది సోమవారం తెల్లవారుజామున బయలుదేరారు. ఈ క్రమంలోనే అనిల్​ గౌడ్​, ఉపేందర్​లు ద్విచక్రవాహనంపై వస్తూ.. మార్గమధ్యలో పీర్లపల్లి సమీపంలోని ఓ కల్వర్టును ఢీకొని, నీటి గుంతలో పడిపోయారు. ఘటనలో యువకులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వెనకాలే వచ్చిన ఆటోలో ఉన్న యువకులు.. విషయాన్ని గుర్తించకుండా ఇళ్లకు వెళ్లిపోయారు. ఎంతసేపటికీ అనిల్​, ఉపేందర్​లు ఇంటికి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు ఉదయం నుంచీ వారిని వెతకడం ప్రారంభించారు.

పీర్లపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కల్వర్టు కింద నీటిలో ద్విచక్ర వాహనం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ద్విచక్ర వాహనంతో రెండు మృతదేహాలను వెలికితీశారు. మృతులు అనిల్, ఉపేందర్​లుగా గుర్తించి.. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం శవాలను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: అదుపు తప్పి నీళ్ల ట్యాంకర్ బోల్తా.. డ్రైవర్ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.