ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని బోనకల్ మండలం రావినూతన గ్రామానికి చెందిన మణికంఠ, పూర్ణశ్రీ అనే ఇద్దరు చిన్నారులు ఇంటి ముందు ఆడుకుంటుండగా రెండు వీధికుక్కులు వారిపై దాడి చేశాయి. వారిని కాపాడబోయి.. శునకాలను అడ్డుకోబోయిన మరో మహిళపైనా అవి దాడికి పాల్పడ్డాయి.
చిన్నారులు ఇద్దరి ముఖంపైనా తీవ్రగాయాలయ్యాయి. వారిని బోనకల్ పీహెచ్లో ప్రాథమిక వైద్యం చేసి ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అధికారులు స్పందించి తమ ప్రాంతంలో ఉన్న వీధికుక్కలను తరిమికొట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చూడండిః పిచ్చికుక్క స్వైర విహారం.. తొమ్మిది మందికి గాయాలు