ETV Bharat / jagte-raho

కన్నీటిసంద్రం: ఆ చిన్నారుల మృతదేహాలు లభ్యం - హన్మకొండలో కాలువలో గల్లంతైన ఇద్దరు బాలురు

ఈత కోసం వెళ్లి రెండు రోజుల క్రితం కాలువలో గల్లంతైన బాలుర మృతదేహాలను పోలీసులు ఇవాళ గుర్తించారు. వరంగల్​ జిల్లా హన్మకొండ పెద్దమ్మగడ్డకు చెందిని వీరి మృదేహాలను దేశాయిపేట, పైడిపల్లి వద్ద గుర్తించారు.

two boys missing in hanmakonda canal found after two days
కాలువలో గల్లంతైన రెండు రోజుల తర్వాత మృతదేహాలు లభ్యం
author img

By

Published : Oct 7, 2020, 10:06 AM IST

హన్మకొండలోని కాలువలో రెండు రోజుల క్రితం గల్లంతైన చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. పెద్దమ్మగడ్డకు చెందిన వెంకట్(14), రాధిల్(14) ఇద్దరు కలిసి ఈతకు వెళ్లారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల కొట్టుకుపోయారు. సాయంత్రమైనా పిల్లలు ఇంటికి రాలేదని... కాలువ వెంట తల్లిదండ్రులు వెతికారు. కాలువ కట్టపై వారి దుస్తులు చూసి... పోలీసులకు సమాచారం ఇచ్చారు.

స్థానికులతో కలిసి పోలీసులు గాలించగా... దేశాయిపేట, పైడిపల్లి వద్ద వారి మృతదేహాలను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. కన్న పిల్లల మృతదేహాలు చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల... కాలువలోకి ఎవరూ దిగవద్దని పోలీసులు సూచించారు.

ఇదీ చూడండి: రైలు ఢీకొని యువకుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.