హత్యాయత్నానికి పాల్పడ్డ ఇద్దరు నిందితులను బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పీఎస్ పరిధిలోని షాహీన్ నగర్ ప్రాంతంలో గత నెల 31న రాత్రి అమీరుద్దీన్ అనే యువకుడిపై సద్దాం, సల్మాన్ అనే ఇద్దరు నిందితులు కత్తులతో దాడి చేసి పారిపోయారు.
బాధితుడిని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. హత్యాయత్నానికి పాల్పడ్డ సద్దాం, సల్మాన్‌లను బాలాపూర్ పోలీసులు షాహీన్‌నగర్ ప్రాంతంలో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పాతకక్షల నేపథ్యంలోనే హత్యాయత్నం జరిగినట్లు బాలాపూర్ సీఐ భాస్కర్ తెలిపారు.
ఇవీ చూడండి: ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ... విద్యార్థి దుర్మరణం