ETV Bharat / jagte-raho

వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన ఏఎస్సైతో పాటు మరో ఇద్దరు అరెస్ట్!

గత నెల 28న హైదరాబాద్​ నాచారం పరిధిలో ఆత్మహత్య చేసుకున్న నరసయ్య అనే వ్యక్తి సూసైట్​ నోట్​ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో అతని మృతికి కారణమైన కరీంనగర్​కు చెందిన ఏఎస్సై మోహన్​రెడ్డితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

author img

By

Published : Sep 29, 2020, 1:12 PM IST

Two arrested along with ASI for causing person suicide!
వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన ఏఎస్సైతో పాటు మరో ఇద్దరు అరెస్ట్!

ఓ వ్యక్తి మృతికి కారణమైన కరీంనగర్​ జిల్లా నివాసి ఏఎస్సై మోహన్​రెడ్డితో పాటు మరో ఇద్దరిని హైదరాబాద్​ నాచారం పోలీసులు అరెస్ట్​ చేశారు. కరీంనగర్​ జిల్లా నివాసి నాగమల్ల వెంకట నరసయ్య... గత నెల 28న నాచారం పీఎస్​ పరిధిలోని లాడ్జిలో పురుగులమందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్లే మరణిస్తున్నట్లు నరసయ్య సూసైడ్​ నోట్​లో వివరించారు. కరీంనగర్​కు చెందిన ఏఎస్సై మోహన్​రెడ్డి.. తన ప్లాటును అక్రమంగా రిజిస్ట్రేషన్​ చేసుకుని తిరిగివ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నారని.. ఇందువల్ల తాను అప్పులు తీర్చడం కుదరట్లేదని నరసయ్య సూసైడ్​ నోట్​లో వివరించారు.

అలాగే జిల్లాకు చెందిన చిట్టుమల్ల శ్రీనివాస్, రేగూరి కరుణాకర్, నాగభూషణం, సంజీవరావుల వేధింపులు తట్టుకోలేక తాను ఐపీ పెట్టాడని.. అయినా వేధింపులు ఆగకపోవకపోవడం వల్లే చనిపోతున్నట్లు నరసయ్య తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న నాచారం పోలీసులు దర్యాప్తు చేపట్టి.. సోమవారం ఏఎస్సై మోహన్​రెడ్డి, నాగభూషణం, శ్రీనివాస్​లను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని వారిని గాలిస్తున్నామని వెల్లడించారు.

ఇదీ చూడండి: ఎట్లా పోవాలి.. శాశ్వత పరిష్కారానికి ఇంకెన్నేళ్లు..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.