ETV Bharat / jagte-raho

కత్తితో బెదిరిస్తూ దోపిడీలకు పాల్పడుతున్న దొంగలు అరెస్టు - hyderabad news

ఈ నెల 2న మాసబ్ ట్యాంక్ వద్ద ఆటో డ్రైవర్​ను కత్తితో బెదిరించి సెల్​ఫోన్ ఎత్తుకెళ్లిన దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల దగ్గర నుంచి రెండు మొబైల్ ఫోన్లు, ఒక కత్తి, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

two accused arrested in robbery case in mangal hot

author img

By

Published : Oct 10, 2020, 10:27 AM IST

కత్తితో బెదిరిస్తూ... దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను మధ్యమండలం టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్​లోని మంగళ్​హాట్ ప్రాంతానికి చెందిన షైక్ యసీన్ పటేల్, మహమ్మద్ ఫర్హాన్​లను అరెస్ట్ చేసి... వారి నుంచి రెండు మొబైల్ ఫోన్లు, ఒక కత్తి, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

విలాసవంతమైన జీవనానికి అలవాటు పడి... మద్యానికి బానిసైన ఇద్దరు యువకులు ఈజీ మనీ కోసం ఈ దొంగతనాలకు పాల్పడినట్లు టాస్క్​ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. ఈ నెల 2న మాసబ్ ట్యాంక్ వద్ద ఆటో డ్రైవర్​ను కత్తితో బెదిరించి సెల్​ఫోన్ ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో సెంట్రల్ జోన్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఇదే తరహాలో హాబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి: ఒకే​ జిల్లాలో ఒకే రోజు 5 మిస్సింగ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.