ఖమ్మంలో ఆర్టీసీ మహిళా కండక్టర్ నీరజ ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. నీరజ సత్తుపల్లి డిపోలో పని చేస్తోంది. ఉద్యోగం పోయిందనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె భర్త తెలిపాడు.
దీపావళి సందర్భంగా నీరజ నిన్న తల్లిగారి ఊరైన పల్లెగూడెం వెళ్లారు. ఇవాళ జిల్లావ్యాప్తంగా చేపట్టనున్న ఆర్టీసీ కార్మికుల ధర్నాలో పాల్గొనాల్సి ఉందని చెప్పి ఖమ్మంలోని ఇంటికి చేరుకున్నారు. కుటుంబసభ్యులు ఇంట్లో లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
సత్తుపల్లిలో ఉద్రిక్తత
ఆర్టీసీ మహిళా కండక్టర్ ఆత్మహత్యకు పాల్పడటంతో సత్తుపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. సత్తుపల్లి డిపో వద్ద కార్మికులు, అఖిల పక్షనాయకులు ఆందోళన చేపట్టారు. వాహనాలను అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.