ETV Bharat / jagte-raho

హోంమంత్రి ముందే తెరాస నేతల కుమ్ములాట

author img

By

Published : Oct 4, 2020, 5:36 PM IST

Updated : Oct 4, 2020, 7:03 PM IST

తెరాస నాయకులు కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ హోం మంత్రి సమక్షంలోనే బాహాబాహీకి దిగారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు. అనంతరం పోలీస్​స్టేషన్​లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.

trs leaders fighting in front of home minister mahamood ali
హోం మంత్రి సమక్షంలోనే తెరాస నేతల బాహాబాహీ

హోం మంత్రి మహమూద్ అలీ సమక్షంలోనే తెరాస నాయకులు బాహాబాహీకి దిగారు. హైదరాబాద్​ రాంకోఠిలోని రూబీ గార్డెన్స్​లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో హోం మంత్రి మహమూద్​ అలీ, గోషామహల్​ నియోజకవర్గ నాయకులు హాజరు కాగా.. తనను వేదికపైకి పిలవలేదని తెరాస సీనియర్​ నేత, ఉద్యమకారుడు ఆర్వి మహేందర్​ కుమార్​ నిలదీయడంతో గొడవ మొదలైంది.

ఈ క్రమంలోనే నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మహమూద్​ అలీ సమక్షంలోనే కొట్టుకున్నారు. చివరకు హోంమంత్రి కలగజేసుకుని ఘర్షణకు దిగిన నాయకులను శాంతింపజేశారు.

మళ్లీ కొట్టుకున్నారు..

సమావేశ అనంతరం హోం మంత్రి వెళ్లిపోగానే.. నాయకులు మరోసారి కొట్లాటకు దిగారు. ఒకొరినొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. అనంతరం నారాయణగూడ పోలీస్​స్టేషన్​లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.

ఇదీ చూడండి: సురవరం సుధాకర్ రెడ్డికి మందకృష్ణ మాదిగ పరామర్శ

Last Updated : Oct 4, 2020, 7:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.