జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం కొలువాయి గ్రామానికి చెందిన రాములు అనే వృద్ధుడు మృతి చెందాడు. అతని కొడుకు కరోనా పాజిటివ్ వల్ల హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాడు. వృద్ధుని అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు, స్థానికులు ఎవరు రాలేదు.
ఫలితంగా మృతుడి కుమార్తె రమ ఆమె కొడుకు శేఖర్ సహాయంతో మృతదేహాన్ని ట్రాక్టర్‌తో తరలించి దహన సంస్కారాలు నిర్వహించారు. శవాన్ని తరలిస్తుండగా గ్రామస్థులు చూస్తూ ఉండిపోయారే తప్పా ఎవరు సాయం చేయలేదు.
ఇదీ చూడండి: 'యుద్ధప్రాతిపదికన దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించండి'