ట్రావెల్స్ వ్యాపారిని హత్య చేసి చెత్త డంపింగ్ యార్డు సమీపంలో పారవేసిన ఘటన మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా కూకట్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మియాపూర్లో నివసించే రామకృష్ణ స్థానికంగా కాకర ట్రావెల్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో ఒకరికి డబ్బులు చెల్లించాలని ఇంటి నుంచి బయటకు వెళ్లిన రామకృష్ణ... ఎంతకు ఇంటికి తిరిగి రాకపోగా.. కుటుంబ సభ్యులు ఈ రోజు ఉదయం మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కైత్లాపూర్ డంపింగ్ యార్డ్ దగ్గరలో ఓ మృతదేహం ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు రామకృష్ణగా గుర్తించారు. మృతుని చెవి వద్ద గాయాలు, రెండు చేతి వేళ్ళు కట్ చేసి ఉండటంతో, రామకృష్ణను హత్య చేశారని నిర్ధారణకు వచ్చి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: దారుణ హత్య: మొండెం, తల, కాళ్లు, చేతులు వేరుచేసి..