ఏపీలోని గుంతకల్లులో ట్రాన్స్ఫార్మర్ మంజూరు కోసం ట్రాన్స్కో ఏడీఈ రవిబాబు రైతుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నట్లు ఓ వీడియో బయటకొచ్చింది. లైన్మెన్ ద్వారా రవిబాబుకు లక్షన్నర లంచం ఇచ్చిన ఇద్దరు రైతులు ఈ మొత్తం వ్యవహారాన్ని రహస్యంగా చరవాణిలో చిత్రీకరించారు. రవిబాబు ఈ డబ్బును గుంతకల్లు పట్టణంలోని హౌసింగ్ బోర్డులో తాను నివాసం ఉండే ఇంట్లో ఓ లైన్ మెన్ మధ్యవర్తిగా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో విద్యుత్ శాఖలో సంచలనంగా మారింది.
ఈ విషయంపై రవిబాబును వివరణ కోరగా.. ఇదంతా అవాస్తవమని, తాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని చెప్పారు. తాను రైతులకు అప్పుగా ఇచ్చానని చెప్పడంతో ఈ ఘటన ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై పూర్తి విచారణ చేపట్టి చర్యలు చేపడతామని.. ఇకపై ట్రాన్స్ఫార్మర్ మంజూరులో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా తామే పర్యవేక్షణ చేపడతామని ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: 'భారత్ బంద్'కు ఆర్టీసీ సంఘాల మద్దతు