ETV Bharat / jagte-raho

సరదా మిగిల్చిన విషాదం: ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల గల్లంతు

వారిద్దరు స్నేహితులు.. ఎటు వెళ్లినా కలిసి వెళ్తారు. చెరువు అలుగు పారుతుండటంతో చూసొద్దామని వెళ్లారు. సరదాగా ఈత కొట్టేందుకు చెరువులో దిగారు. ఒక్కసారిగా ప్రవాహం పెరగడం వల్ల ఉద్ధృతికి కొట్టుకుపోయారు. అందులో ఒకరి మృతదేహం లభ్యమైంది. మరొకరి కోసం గాలిస్తున్నారు. ఈ విషాద ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది.

Tragedy left over from fun: Two young men go swimming and get lost
సరదా మిగిల్చిన విషాదం: ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల గల్లంతు
author img

By

Published : Aug 29, 2020, 11:52 AM IST

నారాయణపేట జిల్లా కేంద్రంలోని మద్దిలేశ్వరీ కాలనీలో నివసించే వెంకటేశ్‌గౌడ్‌, కుమ్మరివాడకు చెందిన నర్సింలు గురువారం సాయంత్రం పేట సమీపంలోని కొండరెడ్డిపల్లి చెరువు అలుగు పారడంతో చూడటానికి వెళ్లారు. ఈత నేర్చుకొందామని ఇద్దరు చెరువులోకి దిగారు. వెంకటేశ్‌గౌడ్‌ లోతుకు వెళ్లి మునుగుతుండగా.. కాపాడే ప్రయత్నంలో నర్సింలు సైతం నీటిలో మునిగిపోయాడు. వీరిద్దరు రాత్రి ఇంటికి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు శుక్రవారం వెతకడం ప్రారంభించారు.

ఈ క్రమంలో చెరువు వద్ద వీరి ద్విచక్రవాహనం కనిపించడంతో చెరువులో జాలర్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా.. నర్సింలు మృతదేహం లభ్యమైంది. వెంకటేష్‌గౌడ్‌ మృతదేహం కోసం గాలిస్తున్నట్లు సీఐ శ్రీకాంత్‌రెడ్డి, ఆర్డీవో శ్రీనివాసులు, పుర కమిషనర్‌ శ్రీనివాసన్‌, తహసీల్దార్‌ దానయ్య తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రమోహన్‌ వెల్లడించారు.

ఇదీచూడండి.. ఆయుధాలతో సంచరిస్తున్న దొంగలు... భయంలో స్థానికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.