భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో రాళ్లలోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో పలువురు కూలీలకు గాయాలయ్యాయి. మంగలితండా నుంచి టేకులపల్లి వైపు వస్తుండగా ఓ మలుపు వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో గోలియతండాకు చెందిన నరసింహ, జయరామ్, రాముడు, భీముడు, జంపన్న గాయపడ్డారు.
క్షతగాత్రులను సులానగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో నరసింహ, జయరామ్ పరిస్థితి విషమంగా ఉంది. కూలీ కోసం వెళ్లినవారిపై విధి వక్రీకరించడంతో తీవ్ర గాయాలపాలు కావటంతో వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది.