సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకులో దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. బ్యాంకు గేటు తాళాలు పగలగొడుతుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకోవడం వల్ల దుండగలు పరారయ్యారు.
శనివారం, ఆదివారం బ్యాంకుకు సెలవు కావడం వల్ల సిబ్బంది ఎవరు లేరు. బ్యాంక్ వద్ద కాపలా సిబ్బంది లేకపోవడం వల్ల దుండగులు చోరీకి యత్నించారు.