హైదరాబాద్‌లో మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ముగ్గురు సాఫ్ట్వేర్ ఇంజినీర్లను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 56 ఎల్‌ఎస్‌డీ బ్లాట్లు, 236 గ్రాముల హశిష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో మౌలాలికి చెందిన శివసేనారెడ్డి, వనస్థలిపురంలోని కమలానగర్వాసి మేకసాయి విపిన్, మల్కాజిగిరికి చెందిన చెరుకూరి హర్షవర్ధన్ ఉన్నారు. మరో నిందితుడు విశాఖపట్నం వాసి కార్తీక్ పరారీలో ఉన్నాడని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
మల్కాజిగిరిలోని సాయివిపిన్ ఇంట్లో, సింగ్‌పూర్ టౌన్‌షిప్‌లో హర్షవర్ధన్ ఇంటిని సోదా చేశారు. విశాఖపట్నానికి చెందిన కార్తిక్ వద్ద కిలో ఆయిల్ రూ.లక్ష రూపాయలకు కొనుగోలు చేసి...12 గ్రాముల ప్లాస్టిక్ బాటిల్ ఒక్కోటి రూ. 2 వేల 5 వందలకు అమ్ముతున్నట్లు దర్యాప్తులో నిందితులు అంగీకరించారు. గోవా నుంచి ఎల్‌ఎస్‌డీ బ్లాట్లు తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారని ఎక్సైజ్ అధికారుల విచారణలో వెల్లడైంది.
ఇదీ చూడండి:గ్రేటర్లో 46.55శాతం.. ఓల్డ్ మలక్‌పేటలో రేపు రీపోలింగ్