రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేర్వేరు ఘటనలో ఒకే రోజు మూడు మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. హయత్ నగర్ కుంట్లుర్ కి చెందిన ఎస్ కే తస్లీమా సుల్తానా కూతురు అయేషా సుల్తానా అదృశ్యమైనట్లు తల్లి ఫిర్యాదు చేసింది.
తొర్రుర్ రాజీవ్ గృహకల్పకి చెందిన గడ్డం కరుణాకర్ హయత్ నగర్ లో ఉన్న కృష్ణవేణి ఆసుపత్రి లో షుగర్ టెస్ట్ కోసం వెళ్లి అదృశ్యమయ్యాడని కుమారుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మర్రిపల్లి గ్రామానికి చెందిన మూడు సంవత్సరాల కుమారునితో పల్లె వరలక్ష్మి... అదృశ్యమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.