ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా చిల్లకురు మండలం నాంచారంపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, లారీ ఢీ కొన్న ఘటనలో.. ముగ్గురు మరణించారు. ప్రమాద సమయంలో ఆటోలో పది మంది ఉన్నారు. ఘటనలో ఏడుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షత గాత్రులను ఆసుపత్రికి తరలించారు.
కృష్ణా జిల్లాలో...
కృష్ణా జిల్లా గౌరవరం గ్రామంలో నందిగామ నుంచి జగ్గయ్యపేట వెళ్లే జాతీయ రహదారిపై.. వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు.. ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్నవారందరికీ గాయాలయ్యాయి. కారులోని ఓ వ్యక్తి సైతం గాయపడగా.. వైద్యం కోసం జగ్గయ్యపేట తరలించారు. మొత్తంగా 12 మంది గాయపడినట్టు గుర్తించారు.
ఇదీ చదవండి: నందకం అతిధి గృహం లిఫ్ట్‌లో ప్రమాదం..ఒకరికి తీవ్రగాయాలు