ETV Bharat / jagte-raho

ఏవోబీలో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు మృతి

ఏవోబీలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. సుమారు 10 మంది తప్పించుకున్నట్లు సమాచారం.

TENSION AT AOB
ఏవోబీలో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు మృతి
author img

By

Published : Dec 13, 2020, 11:14 AM IST

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల‌ు, పోలీసుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు జరిగాయి. క‌టాఫ్ ఏరియా.. సింగారం అట‌వీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వారిలో ఒకరిని మావోయిస్టు పార్టీ ఏరియా క‌మిటీ స‌భ్యుడు మ‌ల్ల‌న్నగా గుర్తించారు. మ‌రొకరిని గుర్తించాల్సి ఉంది.

క‌టాఫ్ ఏరియా ప్రాంతంలోని సింగారం అడవుల్లో మావోయిస్టులు స‌మావేశం నిర్వ‌హిస్తురన్న‌ సమాచారంతో ఒడిశాకు చెందిన ఎస్‌వోజీ, డీవీఎఫ్ బ‌ల‌గాలు గాలింపు చ‌ర్య‌లు చేపట్టారు. పోలీసులు ఆ ప్రాంతానికి వ‌చ్చిన స‌మ‌యంలో 12 మంది మావోయిస్టులు ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ క్రమంలో ఇరు వర్గాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మిగిలిన 10మంది తప్పించుకున్నారు.

త‌ప్పించుకున్నవారి కోసం భ‌ద్ర‌తా బ‌ల‌గాలు గాలింపు చేస్తున్నాయి. ఈ క్రమంలో విశాఖ జిల్లా పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతం చింత‌ప‌ల్లికి స‌మీపంలో ఉన్న కారణంగా.. బ‌ల‌గాల‌ు ఆ అట‌వీ ప్రాంతంలో జల్లెడ పడుతున్నాయి. పీఎల్‌జీఏ వారోత్స‌వాల ముందు జ‌రిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతిచెంద‌గా.. నెల‌రోజుల వ్య‌వ‌ధిలో జ‌రిగిన ఎదురుకాల్పుల్లో మ‌రో ఇద్దరు మావోయిస్టులు మృతి చెంద‌డంతో ఏవోబీలో ఉద్రిక్త‌ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

ఇవీచూడండి: ఎందుకీ తొందర: నిమిషం ఆగితే ఐదుగురి ప్రాణాలు నిలిచేవి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.