ETV Bharat / jagte-raho

రోడ్డు దాటుతుండగా ఢీకొన్న కారు.. బాలిక మృతి - రోడ్డు దాటుతుండగా ఢీకొన్న కారు

భవిష్యత్తులో మంచి డాన్సర్​ కావాలకునుంది. అందుకు తగిన శిక్షణ తీసుకుంటోంది. రోజులాగే డాన్స్​ నేర్చుకునేందుకు వెళ్లింది. కానీ బాలిక పట్ల విధి చిన్నచూపు తీసింది. కారు రూపంలో వచ్చిన మృత్వువు బాలిక కలలను కల్లలు చేసింది. ఇంటికి వెళ్తూ రోడ్డు దాటుతుండగా జరిగిన ప్రమాదంలో తనువు చాలించింది. ఈ విషాద ఘటన నల్గొండ జిల్లా దామరచర్ల మండలకేంద్రంలో జరిగింది.

thirteen years girl died in road accident at damaracharla mandal in nalgonda district
రోడ్డు దాటుతుండగా ఢీకొన్న కారు.. బాలిక మృతి
author img

By

Published : Jan 10, 2021, 11:00 PM IST

నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న బాలికను కారు ఢీకొనగా.. అక్కడికక్కడే మృతి చెందింది. మండలంలోని రాజగట్టుకు చెందిన అంజయ్య కూతురు భవాని(13) డాన్స్​ నేర్చుకుని ఇంటికి తిరిగి వస్తుండగా అద్దంకి-నార్కట్​పల్లి రహదారిపై ఘటన జరిగింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

ఇదీ చూడండి : దొంగ నోట్ల చెలామణి.. ఇద్దరు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.