మేడ్చల్ జిల్లా నాచారం క్రాస్ రోడ్ వద్ద కెనరా బ్యాంక్ ఏటీఎం చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. పెద్ద బండరాయితో మిషన్‌ను పూర్తిగా ధ్వంసం చేసినా, డబ్బులు ఉన్న బాక్స్ ఓపెన్ కాక పోవడం వల్ల అక్కడి నుండి పారిపోయారు. ఈ రోజు ఉదయం ఏటీఎం వద్దకు వెళ్ళినవారు పోలీసులకు సమాచారం అందించారు. ఏటీఎం సెంటర్ లోని సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గాలిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే దారిలో ఇలా జరగడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇదీ చూడండి: కరోనా పంజా: 23 లక్షలు దాటిన కేసులు