భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో రెండేళ్ల క్రితం హల్చల్ చేసిన డ్రిల్లింగ్ దొంగలు మళ్లీ తమ ఉనికి చాటుకుంటున్నారు. గడియ వేసి పడుకున్నా... తలుపునకు రంధ్రం చేసి మరీ ఇంట్లోకి చొరబడుతున్నారు. ఇళ్లు గుళ్ల చేస్తున్నారు. ఈరోజు ఉదయం రెండో నెంబర్ బస్తీలోని ఓ ఇంట్లో నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి ఐదున్నర తులాల బంగారు గొలుసును దోచుకెళ్లారు.
పట్టణంలో మూణ్నెళ్లలో రెండు సార్లు డ్రిల్లింగ్ దొంగలు చోరీలకు పాల్పడ్డారు. మరో రెండు సార్లు ఇంటి యజమానులను బెదిరించి బంగారు ఆభరణాలు దోచేసి చాకచక్యంగా తప్పించుకున్నారు. పోలీసులు వారికోసం గాలిస్తున్నారు.