సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామంలో శనివారం రాత్రి చోరీకి గురైన ఇండి క్యాష్ ఏటీఎం ఆచూకీ లభ్యమైంది. ఏటీఎం దొంగలించిన ఐదుగురు దుండగులకు దాన్ని ఎలా తెరవాలో తెలియలేదు. వేరే దారిలేక కంది మండలం చేర్యాల శివారు ప్రాంతాల్లో వదిలి వెళ్లిపోయారు. దుండగుల కోసం వెతుకుంటూ వెళ్లిన పటాన్చెరు పోలీసులకు ఈ ఏటీఎం కనిపించింది. దాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నగదు ఎక్కడికి పోలేదని స్పష్టం చేశారు. దొంగల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఇవీ చూడండి: విద్యాసంస్థల్లో తగ్గుతున్న డ్రాపౌట్లు... ఎందుకంటే?