వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో దొంగలు రెచ్చిపోతున్నారు. అందరూ చూస్తుండగానే పట్టపగలు ఓ మహిళ మెడలోంచి బంగారు పుస్తెలతాడును చోరీ చేశాడు. నాగ కుమారి అనే మహిళ పట్టణంలోని యశోదనగర్‌లో కిరాణా దుకాణం నిర్వహింస్తోంది. ఆమె వస్తువులు విక్రయిస్తున్న సమయంలో గుర్తు తెలియని యువకుడు షాప్‌కు వచ్చాడు. ఒక్కసారిగా ఆమె మెడలో ఉన్న 5 తులాల బంగారు పుస్తెలతాడును గుంజుకోని కొంత దూరంలో బైక్‌పై సిద్ధంగా మరో వ్యక్తితో కలిసి పారిపోయాడు.
బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రత్యేక బృందాలతో దొంగల కోసం గాలిస్తున్నట్లు ఇన్చ్చార్జి సీఐ లక్ష్మారెడ్డి తెలిపారు. ఇలాంటి దొంగతనాలు జరగడం ఇది రెండోసారి. గతంలో పట్టణంలోని గ్రీన్ సిటీ కాలనీలో మహిళ మెడలోంచి బంగారం చోరీ చేశారు. ఈ దొంగతనం కూడా వాళ్లే చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదీ చూడండి: 'మోదీ 2.0 పాలన హింసాత్మకం, నిరాశాజనకం'