ETV Bharat / jagte-raho

ఏడాది వ్యవధిలో ఒకే ఏటీఎంలో రెండు సార్లు చోరీ

నల్గొండ జిల్లా వెలిమినేడులో ఆదివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానికంగా ఉన్న ఇండిక్యాష్​ ఏటీఎంలో రూ.7 లక్షలు కొల్లగొట్టారు. చిట్యాల ఏటీఎంలో దొంగతనానికి విఫలయత్నం చేసిన దుండగులు వెలిమినేడులో చోరీకి పాల్పడ్డారు. ఆ ఏటీఎంలో దొంగతనం జరగడం ఏడాది వ్యవధిలో ఇది రెండోసారి.

atm robbery in veliminedu
వెలిమినేడులో ఏటీఎం దొంగతనం
author img

By

Published : Feb 8, 2021, 1:26 PM IST

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులోని ఇండిక్యాష్ ఏటీఎంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. ముందుగా వట్టిమర్తి వద్ద కారును దొంగిలించి ఎత్తుకెళ్లగా... వెలిమినేడు గ్రామం వద్దకు చేరుకోగానే అందులో ఇంధనం అయిపోయింది. దుండగులు ఆ వాహనాన్ని అక్కడే వదిలేసి... పక్కనే ఉన్న ఏటీఎంను గ్యాస్ కట్టర్​తో ధ్వంసం చేసి రూ.7 లక్షలు కొల్లగొట్టారు. అదే ప్రాంతానికి చెందిన క్వాలిస్​ను అపహరించి... గుండ్రాంపల్లి వద్దకు చేరుకోగానే ఆ వాహనాన్ని వదిలేసి పరారయ్యారు.

గతేడాది సైతం అదే ఏటీఎంలో రూ.12 లక్షలు చోరీ చేశారు. ఇది ఉత్తరాదికి చెందిన ముఠాల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇదీ చదవండి: దొంగల బీభత్సం.. ఏటీఎంలో చోరీకి విఫలయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.