ETV Bharat / jagte-raho

సహకార సంఘం కార్యాలయంలో నగదు చోరీ.. - mahabubnagar news

మహబూబ్​నగర్​ జిల్లా మిడ్జిల్​ సహకార సంఘం కార్యాలయంలో రూ.1.94 లక్షల నగదు మాయమయ్యాయి. ఎరువుల విక్రయం ద్వారా వచ్చిన నగదుగా అధికారులు తెలిపారు. సిబ్బంది. బయట వ్యక్తుల ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

chory at mahabubnagar co operative society
సహకార సంఘం కార్యాలయంలో నగదు చోరీ..
author img

By

Published : Sep 25, 2020, 8:43 AM IST

మహబూబ్​నగర్​ జిల్లా మిడ్జిల్​ సహకార సంఘం కార్యాలయంలో చోరీ జరిగింది. ఎరువుల విక్రయం ద్వారా వచ్చిన రూ.1.94 లక్షల నగదు మాయమయ్యాయి.

మిడ్జిల్ సహకార సంఘంలో ఎరువుల అమ్మకాలు చేయగా వచ్చిన డబ్బులను బుధవారం సాయంత్రం కార్యాలయంలోని బీరువాలో భద్రపరిచారు. సంఘం కార్యదర్శి జగత్ రెడ్డి.. ఉదయం కార్యాలయానికి వచ్చి చూడగా బీరువాలోని నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ విషయంపై సహకార సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జడ్చర్ల గ్రామీణ సీఐ శివకుమార్, మిడ్జిల్ ఎస్సై సురేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సిబ్బంది, బయట వ్యక్తుల ప్రవేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇవీచూడండి: అవినీతి అనకొండ ఏసీపీ నర్సింహారెడ్డికి 14 రోజుల రిమాండ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.