ఖమ్మం జిల్లా మధిరలో ఓ వైద్యుని ఇంట్లో చోరీ జరిగింది. ప్రభుత్వాసుపత్రిలో వైద్యునిగా పనిచేస్తున్న అనిల్ కుమార్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూలేని సమయంలో తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు 2,40,000 నగదు ఎత్తుకెళ్లారు.
మధిర సీఐ వేణుమాధవ్, ఎస్ఐ ఉదయ్ కుమార్ ఘటనా స్థలిని పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: భద్రాచలం కేంద్రంగా రాష్ట్రాలు దాటుతోన్న గంజాయి