ETV Bharat / jagte-raho

చోరుల హస్తలాఘవం.. బిక్కుబిక్కుమంటున్న జనం

దొంగల భయం పెన్‌గంగా నదీ పరివాహాక ప్రాంతంలోని పల్లె ప్రజానికానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. దొంగలు వస్తున్నారనే సమాచారంతో రాత్రి వేళల్లో జనం నిద్రమానుకొని మరీ గస్తీకాస్తున్నారు.

చోరుల హస్తలాఘవం.. బిక్కుబిక్కుమంటున్న జనం
చోరుల హస్తలాఘవం.. బిక్కుబిక్కుమంటున్న జనం
author img

By

Published : Aug 24, 2020, 7:08 PM IST

ఆదిలాబాద్‌ జిల్లాలో దొంగల భయం వెంటాడుతోంది. ప్రధానంగా పెన్‌గంగా నదీ పరివాహాక ప్రాంతంలోని పల్లె ప్రజానికానికి రాత్రుల్లో కంటిమీద కునుకులేకుండా పోతోంది. కరోనాతో కలవరపడుతుంటే... ఇప్పుడు దొంగల బెడద కొత్త సమస్యగా తయారైందని స్థానికులు వాపోతున్నారు. ఇటీవలే జైనథ్‌ మండలం కోర్టు గ్రామానికి చెందిన కమ్ముల కిష్టయ్య, మడావి గణేశ్​ ఇళ్లల్లో చొరబడి సొత్తు అపహరించుకుపోయారు.

ఊరికి ఆనుకొని ఉన్న పొలానికి ఏర్పాటు చేసుకున్న ఇనుప కంచను కత్తిరించి వచ్చిన దొంగలు... తిరిగి అదే మార్గంగుండా పరారయ్యారు. ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం జందాపూర్‌ రాళ్లబండి ప్రశాంత్‌కు చెందిన ద్విచక్రవాహనం దొంగలించిన దొంగలు రెండురోజుల కిందట మళ్లీ రెండు వాహనాలను దొంగలించడానికి విఫలయత్నం చేయడం గ్రామస్థులను భయాందోళనకు గురిచేస్తోంది. దొంగలు వస్తున్నారనే సమాచారంతో జనం రాత్రుల్లో గస్తీకాస్తున్నారు.

చోరుల హస్తలాఘవం.. బిక్కుబిక్కుమంటున్న జనం

ఇవీ చూడండి: బైక్​లో దూరి యజమానిని ముప్పతిప్పలు పెట్టిన పాము

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.