నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని అంబేడ్కర్ కాలనీ వద్ద బైపాస్ రోడ్డుపై ఓ యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. నందిపేట్ మండలం కంఠం గ్రామానికి చెందిన సందీప్ అమ్మాయిని కలిసేందుకు బోధన్‌కు వచ్చారు.
రాత్రి 2 గంటల ప్రాంతంలో అతని బాబాయ్‌తో ఫోన్లో మాట్లాడారు. వారు కంఠం నుంచి వచ్చేసరికి రహదారిపై శవమై కనిపించాడని మృతుని బాబాయ్ తెలిపారు. చంపేసి రోడ్డుపై పడేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: కలిసి జీవించలేక... వేర్వేరుగా బతకలేక... ప్రేమజంట ఆత్మహత్య