భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మిదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి వద్ద జీపును ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. వారిలో రెండేళ్ల పాప ఉన్నట్లు తెలిపారు.
క్షతగాత్రులంతా ఇల్లందు మండలం సీతానగరానికి చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. పెళ్లి ముహుర్తం పెట్టుకునేందుకు పాల్వంచ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రెండు జీపుల్లో దాదాపు 15 మంది దాకా ఉన్నట్లు తెలుస్తోంది.
బాధితులను పరామర్శించిన జడ్పీ ఛైర్మన్
ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. త్వరితగతిన కోలుకునేలా చికిత్స అందించాలని వైద్యులకు ఆయన సూచించారు.