ETV Bharat / jagte-raho

కుటుంబ కలహం.. అన్నను హతమార్చిన చెల్లి - guntur sister murdered brother news

కుటుంబ కలహాల వల్ల ... అన్నను చెల్లి హతమార్చిన ఘటన ఆంధ్రప్రదేశ్​ గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం కండ్రికలో కలకలం సృష్టించింది.

the-sister-killed-brother-along-with-lover-in-guntur
ఏపీ: కుటుంబ కలహం.. అన్నను హతమార్చిన చెల్లి
author img

By

Published : Sep 26, 2020, 9:02 PM IST

ఏపీలోని గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం కండ్రిక శివారు రేగులగడ్డ గ్రామంలో.. ఈనెల 19వ తేదీ రాత్రి గ్రామానికి చెందిన పోతురాజు.. దారుణ హత్యకు గురయ్యాడు. అతని చెల్లి, ఆమెకు సన్నిహితుడైన వ్యక్తితో కలసి రోకలి బండతో తలపై కొట్టడం వల్లనే పోతురాజు మృతి చెందాడని పోలీసులు తేల్చారు.

వివరాల్లోకి వెళితే..

రేగులగడ్డకు చెందిన గుంజి సాంబయ్య, నాగమ్మ దంపతులకు పోతురాజు, ఆదిలక్ష్మి ఇద్దరు సంతానం. పోతురాజుకు సత్తెనపల్లి మండలం గసర్లపాఫు గ్రామానికి చెందిన వీరమ్మతో వివాహం అయింది. పోతురాజు మద్యానికి బానిస అయిన కారణంగా.. వీరమ్మ విడిగా బతుకుతోంది.

మరోవైపు... పోతురాజు సోదరి ఆదిలక్ష్మికి అమరావతి మండలం అత్తలూరుకు చెందిన శ్రీనివాసరావుతో వివాహం జరిగింది. ఇద్దరికీ మనస్పర్థలు తలెత్తాయి. ఆదిలక్ష్మి తల్లిగారి ఊరైన కండ్రికలో ఉంటోంది. ఆమె పిల్లలు అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదిలక్ష్మికి... గ్రామానికి చెందిన సారాల సాంబయ్యతో సంబంధం ఏర్పడింది.

ఆస్తి కోసం పోతురాజు గొడవ

మద్యానికి బానిసైన పోతురాజు.. ఆస్తి కోసం తల్లిని వేధించేవాడు. నిత్యం తాగి వెళ్లి.. ఇంట్లోవారిని తిట్టేవాడు. తల్లిని ఆస్తి రాసివ్వాలంటూ ఒత్తిడి చేసేవాడు. ఈ నెల 19న రాత్రి సైతం ఇలాగే ప్రవర్తించగా.. సాంబయ్యతో పోతురాజుకు వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు.

కాసేపటికే.. అందరూ నిద్రకు ఉపక్రమించగా... కొద్ది సమయానికి రోకలి బండ తీసుకుని సోదరి ఆదిలక్ష్మి, సాంబయ్య ఇద్దరూ కలసి పోతురాజు తలపై కొట్టిన కారణంగా.. అతను మృతి చెందాడు. నిందితులు ఆదిలక్ష్మి, సాంబయ్యను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: పరువు హత్య.. అల్లుణ్ని చంపించిన మామ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.