నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం బోడబండలో జిలెటిన్‌స్టిక్ ముడిపదార్థం పేలింది. ఈ ఘటనలో ఒకరు స్వల్పంగా గాయపడగా.. ఓ ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది.
గ్రామానికి చెందిన జానకమ్మ నెల క్రితం వంట చెరకు కోసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సమీపంలోని ఓ మూసివేసిన కంపెనీ వద్ద.. కట్టెలతో పాటు కొన్ని వైర్లను ఇంటికి తీసుకెళ్లింది. ఆదివారం సాయంత్రం వంట చేసిన అనంతరం.. పొయ్యిలో నుంచి మిగిలిన కట్టెలు తీసి ఇంటిబయట వైర్లు ఉన్న చోట వేసింది. ఆ కొద్ది సేపటికే ముడిపదార్థం భారీ శబ్దంతో పేలింది.
ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న ఇంటి యజమాని మహేశ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం కొల్లాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: గ్యాస్ పేలుడు ఘటనలో ఇద్దరు మృతి