కొద్ది రోజులుగా సహజీవనం చేస్తున్న ఓ జంట వారి వివాహేతర సంబంధమే వారి ప్రాణాల మీదకు తెచ్చి పెట్టింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా తానూర్ మండలం బోంద్రాట్లో చోటుచేసుకుంది. తానూర్ మండలంలోని బోంద్రాట్కు చెందిన కేరబాయి(30)కి రెండు పెళ్లిళ్లు జరిగాయి. మొదటి భర్త మృతి చెందడంతో రెండో వివాహం చేసుకుంది. రెండో భర్తకూడా మృతి చెందడంతో ఇద్దరు కుమార్తెలతో ఒంటరిగా ఉండేది. ఈ క్రమంలో అదే మండలానికి చెందిన బోసి గ్రామానికి చెందిన లక్ష్మణ్‌తో పరిచయం ఏర్పాడింది.
లక్ష్మణ్‌కు భర్యతోపాటు ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గత నాలుగేళ్లుగా వీరి మధ్య ఆ సంబంధం కొనసాగుతుంది. కేరాబాయితో మంగళవారం రాత్రి గ్రామంలో వారి మధ్య గొడవ జరిగింది. కేరాబాయి ఇతరులతో సన్నిహితంగా ఉన్నట్లు అనుమనించిన లక్ష్మణ్ ఆమెపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. గమనించిన గ్రామస్థులు ఆగ్రహంతో ఆయనను చితక బాదారు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన లక్ష్మణ్‌ని పోలీసులు భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్ఐ రాజన్న తెలిపారు.
ఇదీ చూడండి : అప్పుల బాధ తాళలేక యువరైతు ఆత్మహత్య