ETV Bharat / jagte-raho

ప్రేమించాడు... ఆడపిల్ల పుట్టిందని వదిలేశాడు! - విజయవాడ నేర వార్తలు

వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పండింటి బిడ్డకు జన్మనిచ్చారు. అయితే పుట్టిన బిడ్డ ఆడపిల్లని తెలిసి..జారుకున్నాడు ఆ యువకుడు. దీంతో ప్రేమించి..బిడ్డ పుట్టగానే రోడ్డు పై వదిలేశాడంటూ... సదరు యువతి యువకుడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఈ ఘటన కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం శివపురంలో జరిగింది.

ప్రేమించాడు... ఆడపిల్ల పుట్టిందని వదిలేశాడు!

author img

By

Published : Aug 18, 2020, 7:33 PM IST

ప్రేమించి ఒక బిడ్డ పుట్టిన తర్వాత తనను రోడ్డుపై వదిలేశాడంటూ.... ఓ మహిళ యువకుడి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టిన ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం శివపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోదాటి గోపి విజయవాడకు చెందిన ఓ యువతిని ప్రేమించి ఆడపిల్ల పుట్టిందని అక్కడ నుంచి ఉడాయించి స్వగ్రామం చేరుకున్నాడు.

యువకుడి చిరునామా తెలుసుకున్న బాధిత యువతి తమకు పుట్టిన ఆడపిల్లతో యువకుడి ఇంటి ఎదుట బైఠాయించింది. సత్వరమే తనకు న్యాయం చేయాలంటూ ఆ యువతి పోలీసులను కోరింది. రెండు గంటలుగా యువకుడి ఇంటి ఎదుట ఆందోళన చేస్తున్నా పోలీసులు స్పందించడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామ పెద్దలు కల్పించుకొని సమస్య పరిష్కరించేందుకు కృషిచేస్తున్నారు. ఆ యువకుడు మాత్రం ఇంటి నుంచి బయటకు రావటం లేదు.

ఇవీ చదవండి: మీ ఆదాయంపై కరోనా ప్రభావం ఎంతో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.