ETV Bharat / jagte-raho

ప్రేమపేరుతో దారుణం.. గుంటూరు జిల్లాలో యువతి హత్య..! - గుంటూరు నేర వార్తలు

ఏపీలోని గుంటూరులో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో యువతిని యువకుడు హత్యచేశాడు. ఈ ఘటన పాతగుంటూరు ఆలీనగర్​లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ప్రేమపేరుతో దారుణం.. గుంటూరు జిల్లాలో యువతి హత్య..!

author img

By

Published : Nov 9, 2020, 3:59 PM IST

ఏపీలోని గుంటూరు‌లో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో యువతిని ఓ యువకుడు హత్యచేసిన ఘటన రెండేళ్ల తర్వాత ఆలస్యంగా వెలుగుచూసింది. విచారణలో యువతిని హత్య చేసినట్లు యువకుడు ఆంగీకరించాడు.

2018లో నజీమా అనే యువతి అదృశ్యమైంది. పెళ్లికి వెళ్లిన ఆమె ఇంటికి తిరిగిరాలేదు. ఈ విషయంపై అప్పట్లో పాత గుంటూరు స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కొన్నిరోజులు గాలించిన పోలీసులు... తర్వాత వదిలేశారు. తాజాగా యువతి స్నేహితుల సమాచారంతో... ఆమె తల్లిదండ్రులు ఐజీని కలిశారు. ఐజీ ఆదేశాలతో నాగూర్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి విచారించారు. బాధితురాలి తల్లిదండ్రులలు సోమవారం గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిని కలిశారు. నిందితుడిని అరెస్ట్ చేయగా విషయం వెలుగుచూసింది. ఈ ఘటనలో నిందితునికి సహకరించినవారిని అరెస్టు చేయాలని కోరారు.

ఇదీ చదవండి:

చిన్నారిపై 'వేధింపులు'.. ఆటోడ్రైవర్​ను చితక్కొట్టిన మహిళలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.