ETV Bharat / jagte-raho

అర్ధరాత్రి అగ్ని ప్రమాదం... వృద్ధురాలు సజీవదహనం - ఏపీ వార్తలు

ఏపీలోని విజయనగరం జిల్లా పార్వతీపురంలోని అమ్మిగారికోనేరు సమీపంలోని పూరిళ్ల వద్ద ఆదివారం అర్ధరాత్రి 2గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మూడు పూరిళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతి కాగా... ఒంటరిగా ఉంటున్న సావిత్రమ్మ అనే ఓ వృద్ధురాలు సజీవదహనమైంది.

the-fire-broke-out-at-around-2am-on-sunday-at-huts-near-ammigarikoneru-vizayanagaram
అర్ధరాత్రి అగ్ని ప్రమాదం... వద్ధురాలు సజీవదహనం
author img

By

Published : Nov 9, 2020, 4:08 PM IST

చలి కుంపటి కారణంగా ఓ వృద్ధురాలు సజీవదహనం అయింది. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని అమ్మిగారికోనేరు సమీపంలో ఈ ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అమ్మిగారికోనేరు సమీపంలోని పూరిళ్ల వద్ద ఆదివారం అర్ధరాత్రి 2గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది.

ఈ ఘటనలో మూడు పూరిళ్లు పూర్తిగా కాలిపోగా... ఒంటరిగా ఉంటున్న సావిత్రమ్మ అనే ఓ వృద్ధురాలు సజీవదహనమైంది. మిగిలిన రెండు పూరిళ్లలో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. కానీ వంటసామాగ్రి పూర్తిగా కాలిపోయింది. అగ్నిప్రమాదానికి సావిత్రమ్మ గుడిసెలోని కుంపటే కారణం కావచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:ప్రమాదవశాత్తు పత్తి కుప్ప దగ్ధం... 'ప్రభుత్వమే ఆదుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.